డ్రైవర్ మూర్ఛపోతే.... స్టీరింగ్ ను అందుకొని బస్సుని నడిపిన కాలేజ్ అమ్మాయి

- May 11, 2017 , by Maagulf
డ్రైవర్ మూర్ఛపోతే.... స్టీరింగ్ ను అందుకొని బస్సుని నడిపిన కాలేజ్ అమ్మాయి

 సకాలంలో ఆ కాలేజీ అమ్మాయి స్పందించడంతో... ఒక పెద్ద ముప్పు తప్పింది. మంగళవారం హెయిల్ యూనివర్శిటీ అల్-ఘజ్జలా శాఖకు చెందిన బస్సుని  డ్రైవర్ నడుపుతూ, ఒక్కసారిగా మూర్ఛ వ్యాధికి గురై స్టీరింగ్ మీద అకస్మాత్తుగా పడిపోయాడు బస్సు కుదుపులకు లోనవుతూ దిగువకుపోతూ  ఓ పక్కకు వెళ్ళిపోతుంది ..ఆ క్షణాన ఆ బస్సులో ఉన్న కాలేజీ యువతీలలో ఒక అమ్మాయి  వెంటనే డ్రైవర్ వద్దకు పరుగున రావడం వెనువెంటనే స్టీరింగ్ ను  చేతబుచ్చుకొని చాకచక్యంగా తిరిగి బస్సుని రోడ్డుపై సమర్ధవంతంగా నడిపి భారీ ప్రమాదం నుంచి అందర్నీ కాపాడింది. తన చర్యతో అందర్నీఆశ్చర్యానికి గురిచేసింది.సాహసోపేతమైన ఆ పనితో బస్సులో తన  తోటి యువతులను  కాపాడిన ఆమె సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. కళాశాల బాలికలతో ఒకరైన అష్వాఖ్ అల్-షామిరి, అంతటితో ఆగక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ డ్రైవర్ ను తీసుకొని నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్న  ఆన్లైన్ వార్తాపత్రికలో ఒక నివేదికలో  తెలిపింది. ప్రైవేటు బస్సులో తరగతులకు వెళ్లిన తర్వాత ఆ  అమ్మాయిలు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు.యూనివర్సిటీ బ్రాంచ్ లోని బాలికల విభాగం సాధారణ పర్యవేక్షకుడు డా. హానన్ అల్-అమీర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ,  డ్రైవర్ యొక్క జీవితాన్ని కాపాడటానికి ఆ విద్యార్థిని చేసిన సాహిస చర్య ఎంతగానో  సహాయపడిందని, ఆమె  ధైర్యం మరియు మానవతావాద స్ఫూర్తిని ఆయన మెచ్చుకున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com