రూమర్స్, విశ్వసనీయత లేని వార్తలపై అప్రమత్తం: మినిస్ట్రీ
- May 11, 2017
రూమర్లను ప్రచారం చేసేవారు, అలాగే విశ్వసనీయత లేని వార్తల్ని ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. సోషల్ మీడియా ద్వారా ఈ తరహా దుష్ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యిందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఘటనలు జరగకపోయినా జరిగాయన్నట్లు ప్రచారం చేయడం, అలాగే పనికట్టుకుని కొందరిపై దుష్ప్రచారం కోసం వార్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం తమ దృష్టికి వచ్చిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన రూమర్స్, చలానాలపై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుండడం పట్ల మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ కనిపించినా వాటిని సంబంధిత వర్గాలతో ధృవీకరణ చేసుకోవాలి తప్ప, గుడ్డిగా వాటిని షేర్ చేయడం వల్ల లీగల్ చర్యలకు లోనవుతారని మినిస్ట్రీ హెచ్చరించింది
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







