రూమర్స్‌, విశ్వసనీయత లేని వార్తలపై అప్రమత్తం: మినిస్ట్రీ

- May 11, 2017 , by Maagulf
రూమర్స్‌, విశ్వసనీయత లేని వార్తలపై అప్రమత్తం: మినిస్ట్రీ

రూమర్లను ప్రచారం చేసేవారు, అలాగే విశ్వసనీయత లేని వార్తల్ని ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ హెచ్చరించింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ తరహా దుష్ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యిందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఘటనలు జరగకపోయినా జరిగాయన్నట్లు ప్రచారం చేయడం, అలాగే పనికట్టుకుని కొందరిపై దుష్ప్రచారం కోసం వార్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం తమ దృష్టికి వచ్చిందని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ తెలిపింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన రూమర్స్‌, చలానాలపై ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో ఎక్కువగా వస్తుండడం పట్ల మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఎలాంటి రూమర్స్‌ కనిపించినా వాటిని సంబంధిత వర్గాలతో ధృవీకరణ చేసుకోవాలి తప్ప, గుడ్డిగా వాటిని షేర్‌ చేయడం వల్ల లీగల్‌ చర్యలకు లోనవుతారని మినిస్ట్రీ హెచ్చరించింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com