మనామ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి , ఏడుగురికి గాయాలు
- May 11, 2017
బుధవారం రాత్రి గుఫూల్లోని ఒక భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఒక ప్రవాసీయుడు మృతి చెందాడు, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని నరేన్ కుమార్ తన నివాసంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఊపిరాడక మరణించారు. కాలిన గాయాలతో గాయపడిన ఏడుగురిని సమ్మెనియా మెడికల్A కాంప్లెక్స్ లో చేర్పించారు. 45 నివాసితులలో అందరు ఆసియా దేశస్థులు కాగా అగ్నిప్రమాద సమయంలో వారంతా ఒకే భవనంలో ఉన్నారు. ఈ వ్యక్తులు అందరు ప్రస్తుతం ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసీఆర్ఎఫ్) చేత సహాయం పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, అయితే అగ్ని ప్రమాదంకు వాస్తవ కారణం ఇంకా నిర్ధారించబడలేదు.ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సమన్వయకర్త జాన్ ఫిలిప్ మాట్లాడుతూ ఈ బృందం ఆహారం బాధితులకు అందించి, ప్రత్యామ్నాయ వసతిని కనుగొనేలా వారికి సహాయం చేస్తుందని తెలిపారు. ఈ ఘటనలో వారు అందరూ భారతీయులు కానప్పటికీ మేము వారిని మానవతా దృక్పథంలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, సమీపంలోని రెస్టారెంట్లు నుండి ఆహారాన్ని తీసుకొనేందుకు ఆహార కూపన్లను వారికి అందిస్తామని వారు తమ సొంత స్థలంలో ఉన్నట్లుగావారికి ఒక స్థలాన్ని సైతం కనుగొంటామన్నారు. తమ వల్ల సాధ్యమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి సహాయపడటామని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం పొరుగున నివసించే ఫిలిప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి అసలు కారణం ఇంకా నిర్ధారించబడలేదని ఆయన చెప్పారు. అంతర్గత వ్యవహారాల మంత్రి అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తదుపరి సమాచారం లో తెలిసే అవకాశముంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







