పూర్తి కానున్న ప్రధాన ప్రధాన రోడ్ ప్రాజెక్ట్‌లు
- May 12, 2017
మూడు ప్రధాన రోడ్ ప్రాజెక్టులు వెస్టర్న్ మరియు సౌత్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఖతార్‌లో పూర్తయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని పబ్లిక్స్ వర్క్స్ అథారిటీ అష్గల్ వెల్లడించింది. రాదత్ రషెద్ రోడ్ (ఫేజ్ 3), న్యూ ఇండస్ట్రియల్ ఏరియా ఇంటర్‌ఛేంజ్ (ఆర్బిటల్ హైవేపై), రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్రక్టచర్ డెవలప్మెంట్స్ - బని హజెర్ నార్త్ ఆ మూడు ప్రాజెక్టులు. సల్వా రోడ్ - దుకాన్ ఎక్స్‌ప్రెస్‌వేలను కలిపే రాదత్ రషెద్ రోడ్డు పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. 14 కిలోమీటర్ల మేర ఇరువైపులా మూడు లేన్లతో ఈ ఫేజ్ 3 ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. ఈ ఏడాది చివరి క్వార్టర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 40 శాతానికి పైగా ఈ ప్రాజెక్ట్‌లో ఫేజ్ 3 పూర్తయ్యిందని అధికారులు వివరించారు. న్యూ ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ ఇంటర్‌ఛేంజ్ పనులు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇంటర్‌ఛేంజ్ ద్వారా రాకపోకలు సాగుతాయి. బని హజెర్ నార్త్ ప్రాజెక్ట్ కూడా 70 శాతం పూర్తయ్యింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









