28 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనున్న 'క్యు పోస్ట్'
- May 12, 2017ఖతార్ పోస్ట్, కొత్తగా ఖతార్‌లో 28 కొత్త బ్రాంచ్‌లు అలాగే 10 కొత్త స్మార్ట్ లాకర్స్‌ని ప్రారంభించనుంది. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వినియోగదారుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. 40 చదరపు మీటర్ల వైశాల్యంతో కొత్తగా స్టోరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వుంది. క్యు పోస్ట్ 'డిజిటల్ మెయిల్‌రూమ్ సొల్యూషన్స్' సర్వీస్ - డిజిటైజేషన్ సొల్యూషన్ ద్వారా డాక్యుమెంట్ ఆర్కైవింగ్, కంపిలెన్స్ మేనేజ్‌మెంట్ సౌకర్యాల్ని కల్పించనుంది. వర్క్ షాప్‌లో క్యు పోస్ట్ వర్గాలు భవిష్యత్ ప్లాన్స్‌ని వివరించాయి. డిజిటల్ టచ్ పాయింట్స్‌ని వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకోసం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్ పోస్ట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ మౌద్ డేనియల్ మాట్లాడుతూ, కొత్త బ్రాంచ్‌లు వినియోగదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. త్వరలో కస్టమర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్‌ని కూడా ప్రారంభించనున్నట్లు వివరించారామె. ఖతార్ పోస్ట్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫలెమ్ అల్ నయీమి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







