ఇజ్రాయిల్‌ లో ఏడుస్తూ న్యూస్ చదివిన యాంకర్

- May 12, 2017 , by Maagulf
ఇజ్రాయిల్‌ లో ఏడుస్తూ న్యూస్ చదివిన యాంకర్

న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇజ్రాయిల్‌కి చెందిన గ్యులా ఈవెన్‌ ఏడుస్తూ వార్తలు చదివింది. ఛానెల్‌ 1 అనే పేరుతో న్యూస్‌ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోన్న గ్యులా ఈవెన్. తాను వార్తాలు చదువుతున్న వేళ ఓ చేదు వార్తా వినలసి వచ్చింది. అదేంటే కొన్ని పొలటికల్ వివాదాలతో ఇజ్రాయిల్‌ దేశ పీఎం బెంజమిన్‌ నేతన్యాహు ఛానెల్‌ 1ను మూసేయాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది. 
ఇదీ ఈ వార్తా ఛానెల్‌ ఇజ్రాయిల్‌లో చాలా ఫేమస్‌. ఈ చానెల్ స్థాపించి దాదాపు 49 ఏళ్లు అవుతుంది. పీఎం నేతన్యాహు మీడియా పట్ల అమెరికా ప్రెసిడెంట్ లాగానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్‌ స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com