రెండు తెలుగు రాష్ట్రాలలో ఈనెల 14 నుంచి 18 వరకూ మండనున్న ఎండలు, వేడి గాలులు
- May 12, 2017
మే నెల ప్రారంభం కాకుండానే వాతావరణం లో మార్పులు చోటు చేసుకొన్నాయి.. పగలు విపరీతమైన ఎండ, రాత్రి వర్షం తో విచిత్ర మైన పరిస్తితి నెలకొన్నది.. కాగా ఈ ఏడాది ఋతుపవనాలు త్వరగా వస్తున్నాయని వాతావరణ శాఖ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ అంతకంటే షాక్ కలిగించే న్యూస్ ఏమిటంటే... మే నెలలో ఎండలు మండిపోతాయట... ఋతుపవనాలు వచ్చేస్తున్నాయని చల్లని కబురు ఎంత సంతోషం కలిగించిందో... అంతకంటే ఎక్కువగా మే నెలలో ఎండాలను తీవ్ర వడగాల్పులను ఎదుర్కోవలని ఇస్రో సంస్థ చెప్పింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనకు ఇస్రో సంస్థ వాతావరణ వివరాలను అందజేస్తోన్న సంగతి విధితమే.. ఈ నేపద్యంలో ఇస్రో చెప్పిన వాతావరణ వివరాల ప్రకారం..
ఉత్తర భారత నుంచి వేడిగాలులు వీస్తూ .. గుజరాత్, రాజస్థాన్ ల మీదుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని మరాఠ్వాడ, తెలంగాణా, అంధ్రప్రదేశ్ తీరం వరకూ వీస్తాయట. ఈ వేడిగాలుల కారణంగా ఏపీలోని ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తో పాటు రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ తీవ్రస్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 14 తేదీ నుంచి 18 తేదీ ల మధ్య తీవ్రమైన పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని... బయటకు వెళ్ళే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







