స్కూల్ బస్‌లను వినియోగించే విద్యార్థుల్లో 133 శాతం పెరుగుదల
- May 12, 2017
దుబాయ్: స్కూల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసు బస్సుల్ని వినియోగించే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. గతంలో 3,000గా ఉన్న ఈ సంఖ్య ఈ ఏడాది 7,000 వరకు చేరుకుందని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ తెలిపాయి. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 133 శాతం అదనంగా విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ సర్వీసులను వినియోగించుకుంటున్నారని తేలింది. స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులకున్న నమ్మకాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సులపై వేగానికి సంబంధించిన సమాచారం ఉంచడం, అలాగే బస్సుకి ఓ సూపర్వైజర్ని ఏర్పాటు చేయడం, బస్సులకు సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయడం, వంటి చర్యల ద్వారా బస్సుల్ని, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫ్రెండ్లీగా మార్చారు. జిపిఎస్ బస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పేరెంట్స్, తమ పిల్లలు ప్రయాణిస్తున్న బస్ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కలుగుతోంది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









