వరుణ్ చేతులమీదుగా 'వాసుకి' ఫస్ట్ లుక్
- May 12, 2017
మలయాళ బ్లాక్‌బస్టర్ 'పుదియ నియమం' తెలుగులో 'వాసుకి' గా వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'వాసుకి' ఫస్ట్‌లుక్ పోస్టర్ని మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నేడు హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, వరుణ్‌తేజ్ సహా చిత్రయూనిట్ పాల్గొంది. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ మాట్లాడుతూ -"మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయం అందుకోవడమే గాకుండా.. నయన్‌కి చక్కని పేరు తెస్తుందనే అనుకుంటున్నా. అలాగే తెలుగు వెర్షన్ నిర్మాతకు చక్కని సక్సెస్ దక్కాలని ఆశిస్తున్నా" అన్నారు. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ-"పొరుగు భాషలో పెద్ద హిట్టయిన ఈ చిత్రం తెలుగు నిర్మాతలకు అంతే మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నా. నిర్మాత మోహన్ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నా. వాసుకి పెద్ద హిట్టవ్వాలి.. డబ్బు, పేరు తేవాలి" అన్నారు. నిర్మాత మోహన్ మాట్లాడుతూ-"మా సినిమా ఫస్ట్‌లుక్‌ని మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ గారు, నాగబాబు గారు లాంచ్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వారికి ధన్యవాదాలు. ఆ ఇద్దరి చేతులమీదుగా ఫస్ట్‌లుక్ లాంచ్ చేయడమే విజయానికి తొలి మెట్టుగా భావిస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. -
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







