మొత్తానికి వివాహ బంధానికి తెర దింపిన మలైకా మరియు అర్బాజ్ లు
- May 12, 2017
ఇటీవల తమ వైవిహిక బంధాలని విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టేవారు ఎక్కువయ్యారు.. ముఖ్యంగా సినీ జంటలు ఎన్ని సంవత్సరాల బంధానికైనా విడాకులతో చెల్లు అంటున్నారు.. తాజాగా బాలీవుడ్ జంట అర్భాజ్ ఖాన్, మలైక్ అరోరాలు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి విడకులతో తెరదింపారు.. గత ఏడాది నవంబర్ లో ఈ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి విధితమే.. ఈ నేపద్యంలో తాజాగా ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ...ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.. కాగా అర్భాజ్ ఖాన్ కు మలైక్ లకు 1998 లో వివాహం జరగగా ఈ దంపతులకు 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. గత కొంత కాలంగా ఈ జంట మధ్య ఏర్పడిన వివాదాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు.. పలు మార్లు ఈ జంటకు కౌన్సిలింగ్ చేసినా ఈ జంట విడిపోవడానికే నిశ్చయించుకోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.. కాగా మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో అతి సన్నిహితంగా ఉండడమే వీరిద్దరి మధ్య వివాదాలకు కారణం అని బీ టౌన్ టాక్.. కాగా అర్భాజ్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కు తమ్ముడు అన్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









