ప్రపంచవ్యాప్తంగా సైబర్ అటాక్
- May 13, 2017
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సైబర్ అటాక్ జరిగింది. దాదాపు 100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఫలితంగా ప్రపంచం వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్, ఎయిర్ లైన్స్ రంగాలు స్థంభించిపోయే పరిస్థితి దాపురించింది. లండన్ లో వైద్య ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టు ర్యాన్సమ్ వేర్ ప్రకటించింది.
సరికొత్త మాల్ వేర్ తో హ్యాకర్లు అటాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడిగా ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ సైబర్ అటాక్ బారిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు, చైనా తదితర దేశాలు ఉన్నాయని తెలుస్తోంది.కంప్యూటర్ ఓపెన్ చెయ్యగానే ఒక మెసేజ్ వస్తోందని, అది ఓపెన్ చేయ్యగానే...కంప్యూటర్ మొత్తం కోడింగ్ లోకి మారిపోతోందట. కంఫ్యూటర్ మామూలు స్థితికి రావాలంటే డబ్బులు కట్టాలని మెసేజ్ కూడా వస్తోంది. దీంతో దీనిని డీ కోడ్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
కంఫ్యూటర్ల హ్యాకింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పందించారు. తన కంఫ్యూటర్ హ్యాక్ కాలేదన్నారు. ఐవోఎస్ వాడుతున్నందున హ్యాకింగ్‌కు ఆస్కారం లేదన్న ఆయన, విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా హ్యాక్‌కు గురైన కంప్యూటర్ల డీ కోడింగ్‌కు పోలీస్ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









