అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- April 20, 2026
అమెరికా: అమెరికాలోని లూసియానా రాష్ట్రం ష్రీవ్‌పోర్ట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక దుండగుడు తన సొంత పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది చిన్నారులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోర ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిందితుడు వెస్ట్ 79వ స్ట్రీట్‌లోని రెండు ఇళ్లపై, అలాగే హారిస్ స్ట్రీట్‌లోని మరో నివాసంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన చిన్నారులంతా ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన అనంతరం నిందితుడు ఒక కారును దొంగిలించి (Mass shooting USA ) అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని వెంబడించి బోసియర్ సిటీ సమీపంలో ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అమెరికాలో గన్ నియంత్రణ చట్టాలపై మళ్లీ చర్చ మొదలైంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







