నారాయణను పరామర్శించిన ఏపీ సీఎం, హరికృష్ణ
- May 13, 2017
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణను సీఎం చంద్రబాబునాయుడు శనివారం పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నిషిత్ మరణం తనను బాధించిందన్నారు.
ఈ ప్రమాదం ఊహించనది అని పేర్కొన్నారు. నిషిత్ ఆత్మకు శాంతికలగాలని కోరుకున్నారు. నారాయణ విద్యాసంస్థలను నిషిత్ సమర్థంగా నిర్వహించారని, చేతికొచ్చిన సమయంలో కుమారుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. నారాయణను అధైర్యపడవద్దని సూచించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొవాలని ఆయనకు సూచించినట్లు బాబు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి ఉన్నారు. అమెరికా నుంచి తిరిగివచ్చిన వెంటనే చంద్రబాబు మంత్రి నారాయణను కలిసేందుకు నెల్లూరు వెళ్లారు. ఆయనతోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నారాయణను పరామర్శించారు.
సినీనటుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కూడా మంత్రి నారాయణను పరామర్శించారు. కొడుకును కోల్పోయిన బాధ ఎలావుంటుందో తనకు తెలుసని అన్నారు. ఈ సమయంలో మంత్రి నారాయణకు మనో ధైర్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









