మెగాస్టార్ కోసం స్టార్ రైటర్స్

- May 13, 2017 , by Maagulf
మెగాస్టార్ కోసం స్టార్ రైటర్స్

మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 ఇచ్చిన సక్సెస్ జోష్ తో నెక్స్ట్ చేయబోయే ఉయ్యాలవాడ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కథను స్టార్ రైటర్స్ అయినా పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేయగా , డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిన్న పాటి మార్పులు చేసి కథను దాదాపు ఓ కొలిక్కి తీసుకొచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో ముగ్గురు స్టార్ రైటర్స్ ను తీసుకున్నారని సమాచారం.
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కథతో పాటు డైలాగ్స్ కూడా ముఖ్యం కావడం తో దీని కోసం రచయితలు వేమారెడ్డి, బుర్రా సాయిమాధవ్, మధు లను తీసుకున్నారని వినికిడి. వీళ్ల ముగ్గురితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ సన్నివేశాలకు తగ్గట్టు 3-4 వెర్షన్ల డైలాగ్స్ రాయిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.
డైలాగ్స్ అన్ని సిద్ధం అయ్యాక చిరంజీవి , నిర్మాత రామ్ చరణ్ లకు వినిపిస్తారట..వారు ఒకే చెప్పక ఫైనల్ చేస్తారని సమాచారం. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com