విశాఖ లో 1500 కోట్ల హవాలా కుంభకోణం దర్యాప్తు వేగవంతం
- May 13, 2017
భారీ హవాలా స్కామ్‌లో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు వడ్డీ మహేశ్ సహా అరెస్టైన నలుగురిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. విశాఖ, కోల్‌కతాల్లో డొల్లకంపెనీలను ఏర్పాటు చేసిన నిందితులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.680 కోట్లు జమచేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటిల్లో 570 కోట్లను చైనా, సింగపూర్, హంకాంగ్‌లకు తరలించారని తెలుసుకున్నారు. ఈ కేసులో A వన్‌గా వడ్డి మహేశ్, A 2 అతడి తండ్రి వడ్డి శ్రీనివాసరావును పేర్కొన్న పోలీసులు ఆచంట హరీశ్, ఆచంట రాజేశ్‌లను ఏత్రీ, ఏ ఫోర్‌గా చేర్చారు. చార్టెడ్ అకౌంటెంట్లు ప్రసన్నకుమార్, ప్రవీణ్‌కుమార్‌లపై కూడా కేసులు నమోదు చేశారు. చిన్న వ్యాపారస్తులు బెంజ్ కారు కొనే స్థోమత ఎక్కడిదనే డౌటే హవాలా గుట్టు బయటపెట్టింది. కొల్ కతా కంపెనీల నుంచి డబ్బు విశాఖ బ్యాంకుల్లోకి రాగా.. ఇక్కడి నుంచి నెఫ్ట్, RTGS ద్వారా విదేశాలకు ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేసినట్టు గుర్తించారు. హవాలా కేసులో దొరికిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రం కూడా దీనిపై విచారణ చేపట్టనుంది. మూలాలు తెలుసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. 1369 కోట్ల కుంభకోణానికి సూత్రధారి అయిన వడ్డి మహేశ్ వెనుక ఎవరైనా ఉన్నారా.. ఇదంతా చేయించారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. అతడికి రాజకీయ నాయకులు, బడా వ్యాపారులతో ఉన్న పరిచయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









