ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు
- May 13, 2017
ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పుణెకు బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. ప్లేన్‌ను తిరిగి శంషాబాద్ రప్పించారు. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అందులో 96 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళనకు దిగారు. నిన్నరాత్రి 8న్నర గంటలకు ఎయిరిండియా విమానం టేకాఫ్ అయింది. 20 నిమిషాల జర్నీ తర్వాత అందులో సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్.. ATCకి సమాచారం అందించాడు. వాళ్లు వెనక్కు వచ్చేయాల్సిందిగా చెప్పారు. దీంతో.. వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి.. శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







