నానీ ‘నిన్ను కోరి’ మూవీకి ఏకంగా రూ 20 కోట్ల బిజినెస్

- May 14, 2017 , by Maagulf
నానీ ‘నిన్ను కోరి’ మూవీకి ఏకంగా రూ 20 కోట్ల బిజినెస్

నేచుర‌ల్ స్టార్ నాని నేను లోకల్ సినిమా హిట్ తరువాత ఇప్పుడు ‘నిన్ను కోరి’ సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో తనదైన ట్రేడ్ మార్క్ కామిడీ లవ్ టచ్ ఉంటుందట. ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని అనే ఒక్క పేరు తప్పితే ‘నిన్ను కోరి’ సినిమాలో పెద్ద పేర్లు ఏమి లేవు. కానీ ఈ సినిమా రూ.20 కోట్లు వరుకు బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి ఈ నేచురల్ స్టార్ గత సినిమాలు సుమారుగా పన్నెండు పద్నాలుగు కోట్ల మధ్య బిజినెస్ జరిగేవి. కానీ ఇప్పుడు ‘నిన్ను కోరి’ సినిమా రూ.20 కోట్ల బిజినెస్ చేయ‌డం నానీ పెద్ద రేంజ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.. ఇక ఈ మూవీ కూడా హిట్ అయితే రూ 25 కోట్ల మార్క్ ను దాటేస్తాడ‌ని అంటున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com