ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతకు రూ.14 కోట్లు

- May 14, 2017 , by Maagulf
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతకు రూ.14 కోట్లు

ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత ఈసారి దాదాపుగా రూ. 14 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది. 2013తో పోల్చుకుంటే ఐసీసీ టోర్నీ ప్రైజ్‌మనీని 5 లక్షల డాలర్లు పెంచింది. ఈసారి మొత్తం 4.5 మిలియన్‌ డాలర్లు జట్లకు పంచనుంది. విజేత జట్టుకు 2.2 మిలియన్‌ డాలర్లు లభించనుండగా రన్నరప్‌ జట్టుకు 1.1 మిలియన్‌ డాలర్లు దక్కుతాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లు 4.5 లక్షల డాలర్లు.. గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచే జట్లు 90 వేల డాలర్లు, ఆఖరి స్థానంలో నిలిచే జట్లు 60 వేల డాలర్లు పొందుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com