భారత్ లో సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్
- October 06, 2015
భారత్ లో సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ దూసుకుపోతున్నది. 51శాతం యూజర్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గా నిలిచింది. అదేవిధంగా ఇన్ స్టంట్ మెసెజింగ్ యాప్స్ విషయంలో వాట్సాప్ 56శాతం యూజర్లతో ముందంజలో ఉంది. "కనెక్టెడ్ లైఫ్' పేరిట అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాలకు చెందిన 60,500 మంది ఇంటర్నెట్ యూజర్ల డిజిటల్ మనస్తత్వం, ప్రవర్తనలపై టీఎన్ఎస్ అధ్యయనం జరిపి ఓ నివేదిక వెల్లడించింది. భారత్ లో సోషల్ మార్కెటింగ్ వ్యాపారమంతా ఫేస్ బుక్ కేంద్రంగా సాగుతున్నదని, దీంతో ఫేస్ బుక్ లోనూ వ్యక్తిగత సందేశాలు భారీగా ఉంటున్నాయని, అయితే ఇన్ స్టంట్ మెసెజింగ్ విషయంలో మాత్రం వాట్సాపే ముందుంజలో ఉందని టీఎన్ఎస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరిజత్ చక్రవర్తి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడోవంతుమంది (30%) యూజర్లతో ఫేస్ బుక్ ప్రజాదరణలో మొదటిస్థానంలో ఉంది. అయితే ప్రతిరోజు ఫేస్ బుక్ లో లాగిన్ అయ్యేవారి సంఖ్య ఆసియా పసిఫిక్ లో భారీగా ఉంది. ఫేస్ బుక్ వినియోగం విషయంలో భారత్ లో 51శాతం ఉండగా, ఆసియా పసిఫిక్ దేశాలైన థాయ్ లాండ్ (78%), తైవాన్ (72%), హాంకాంగ్ (72%) లో ఇంకా అత్యధికశాతం ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







