దిల్ రాజు బ్యానర్లో హీరో రాజ్ తరుణ్
- May 15, 2017
శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు, రాజ్ తరుణ్ మధ్య విబేధాలొచ్చాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. శతమానం భవతి సినిమాను ముందుగా రాజ్ తరుణ్ హీరోగా చేయాలని భావించాడు దిల్ రాజు. అయితే చివరి నిమిషంలో శర్వానంద్తో సినిమా చేశాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో రాజ్ తరుణ్ చేతులారా మంచి హిట్ సినిమాను చేజార్చుకున్నాడని భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రాజ్ తరుణ్, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నాడట. శతమానం భవతి సినిమా సమయంలో అప్పటికే ఏకె ఎంరట్టైన్మెంట్స్తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. అందుకే మరోసారి దిల్ రాజు ఆఫర్ ఇవ్వగానే వెంటనే ఒప్పేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రాజ్ తరుణ్.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







