బహ్రెయిన్ ఆసుపత్రుల్లో కలరా అలర్ట్
- October 06, 2015
ఇరాక్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కలరా లక్షణాలు కనిపించడంతో బహ్రెయిన్‌లో కలరా అలర్ట్‌ని ప్రకటించారు. కలరా వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని ఆ వ్యక్తిలో గుర్తించారు ఆసుపత్రి వైద్యులు. ఇరాక్ నుంచి పెద్ద సంఖ్యలో ఫిలిగ్రిమ్స్ బహ్రెయిన్‌కి వస్తుండడంతో వారితోపాటే దేశంలోకి కలరా వ్యాధి కూడా తరలి వచ్చే అవకాశమున్నందున వైద్య రంగం తరఫున అలర్ట్ ప్రకటించారు. కలరాని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆసుపత్రులను కోరింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ సంవత్సరం ఇప్పటిదాకా 851 మంది కలరా వ్యాధికి గురవగా, వారిలో 95 శాతం మంది పూర్తిగా కోలుకున్నట్లు వైద్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కలరాను నియంత్రించవచ్చు. ఇరాక్ నుంచి వచ్చేవారెవరూ ఆహారం, మంచి నీళ్ళు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేశారు. 2007లో కలరా విజృంభించడంతో 7 వేల మందికి కలరా సోకగా, 10 మంది మృత్యువాతపడ్డారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







