తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
- October 06, 2015
బహ్రెయిన్ మంత్రి వర్గం నిన్న సమావేశమై తీవ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు పలు చర్యలు తీసుకోవడంపై చర్చించింది. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు చేస్తున్న కృషిని మంత్రివర్గం కొనియాడింది. కొత్త చట్టాల్ని తీసుకొచ్చి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, గుదైబా ప్యాలెస్లో జరిగిన మంత్రివర్గ సమావేశానికి నాయకత్వం వహించారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రీమియర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కింగ్ హమాద్కి కృతజ్ఞతలు తెలిపింది మంత్రివర్గం. తీవ్రవాద దుశ్చర్యల్ని సౌదీ అరేబియాలో అడ్డుకోవడం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. తీవ్రవాదాన్ని అణచివేయడంలో సౌదీ అరేబియాకి బహ్రెయిన్ అండగా ఉంటుందని మంత్రివర్గం వెల్లడించింది.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







