గుర్షా దుబాయ్: ఆఫ్రో థర్స్‌డేస్
- May 17, 2017
పామ్ జుమైరాలోని ప్రముఖ క్లబ్ విస్టా మెరెలో కొలువుదీరిన ఇథియోపియన్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రెస్టారెంట్ గుర్షా దుబాయ్, ఆఫ్రో థర్స్‌డేస్ పేరుతో వీక్లీ ఎంటర్టైన్మెంట్ నైట్ కాన్సెప్ట్‌ని అందుబాటులోకి తెచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఆఫ్రో థర్స్‌డేస్ వీక్లీ ఎంటర్టైన్మెంట్ నైట్ ప్రారంభమవుతుంది. ఆఫ్రో ఫంక్, రెగ్టాఇయాన్, డాన్స్ హాల్, ఆఫ్రో బీట్స్, హిప్ హాప్ సహా పలు కార్యక్రమాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సంప్రదాయ అఫ్రో డ్రమ్స్‌కి డిజె బీట్స్‌ని మిక్స్ చేసి, సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందివ్వనున్నారు. సంప్రదాయ వంటకాలతోపాటుగా, ప్రీమియమ్ మరియు హౌస్ బెవరేజెస్ మరో ప్రధాన ఆకర్షణ. అఫ్రో థర్స్‌డేస్ గురించి ఎగ్జిక్యూటివ్ చెఫ్ బీడె వోర్కె మాట్లాడుతూ, ఇథియోపియన్ సంప్రదాయాల్ని యూఏఈ వాసులకు పరిచయం చేసే క్రమంలో అత్యద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని జోడించి ఈ న్యూ కాన్సెప్ట్‌ని డిజైన్ చేశామన్నారు. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు గుర్షా దుబాయ్, క్లబ్ విస్టా మారె, పామ్ జుమైరాలో ఈ అనుభూతిని పొందవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







