నందిని సిద్దారెడ్డికి సన్మానం తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో
- May 17, 2017
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన డా. నందిని సిద్దారెడ్డీ గారిని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు ప్రతాని రామక్రిష్ణ గౌడ్ ఉపాష్యక్షులు జె.వి.ఆర్ సెక్రటరీ లయన్ సాయి వెంకట్ , తెలంగాణ మూవి అండ్ టీ.వి ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు నటి కవిత , కవి గాయకులు సి.యం.ఓ.ఎస్.డి.దెశపతి శ్రీను ఖైరతబాద్ నియోజక వర్గ టి.ఆర్.ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్దన్ రెడ్డి సీనియర్ నటులు నరసింహ రాజు , చిట్టి బాబు , గీతాంజలి , రోషంబాబు , మిస్ ఎషియా రెష్మి ఠాకుర్ , కుమారి షప్ర గౌర్ తదితరులు పాల్గొన్నారు.....
ఈ సంధర్భంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఛైర్మన్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్ గారు మాట్లాడుతు నందిని సిద్దారెడ్డి గారు మా సిద్దిపేట ప్రక్కన గ్రామమైన బందారం గ్రామ వాస్తవ్యులు గత 25 సంవత్సరాల నుండి నాకు బాగా ఆప్తులు మంచి రచయిత , నాగేటి సాళ్ళల్లో అనే పాటకు నంది అవార్డు గ్రహిత మంచి సాహితి వెత్త , ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు మంచి ఆలోచనతో నందిని సిద్దారెడ్డి గారి సాహిత్య అకాడమి ఛైర్మన్ గా నియమించడం వల్ల తెలుగు భాషకు న్యాయం జరుగుతుందని , తెలుగు సినిమాకు మంచి సపోర్ట్ దొరుకుతుందని వీరిని నియమించినందుకు సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని , సినిమా ఇండస్ట్రీ మంచి జరగాలన్న ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సి.ఎమ్.కే.సి.ఆర్ గారికి ప్రత్యేక క్రుతజ్నతలు , మరియు అబినందనౌ తెలియజేసారు ......దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నందిని సిద్దారెడ్డి సాహిత్య సేవలను కొనియాడారు తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ గా కూడా విజయం సాదించాలని , చేనేత కార్మికులపైన అధ్బుత మైన పాట రాయడం వారి జీవన విదానాన్ని కళ్ళకు కట్టినట్టు రాసి ఎందరో హ్రుదయాలను దోచుకున్న కవి.
సాయి వెంకట్ మాట్లాడుతూ మా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో మా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో వీరిని ఘనంగా సన్మానించడం ఆనందదాయకం ..
జె.వి.ఆర్ గారు మాట్లాడుతూ కళల సాహిత్యం గురించి తెలిసిన వ్యక్తి సిద్దారెడ్డి గారిని నియమించడాన్ని కొనియాడారు
కవిత గారు మాట్లాడుతూ నందిని సిద్దారెడ్డి గారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందని త్వరలో జరగబోయె ప్రపంచ తెలుగు మహ సభలపై తెలుగు వారందరిని కలుపుకొని విజయవంతం చేయలని కోరారు.
సన్మాన కర్త నందిని సిదారెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రక్క గ్రామమై మిట్టపల్లి వాస్తవ్యుడు మరియు నా ప్రాణ స్నేహితుడైన ప్రతాని రామక్రిష్ణ గౌడ్ నన్ను ఈ విదంగా సన్మానించడం నాకు చాలా ఆనందాయకం గత 30 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండే తెలంగాణ ఫిల్మ్ చాంబర్ స్థాపించి రెండు రాష్ట్రాల తెలుగు వారందరిని కలుపుకొని , సిని కార్మికుల కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కనుసన్నలతో ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో అభివ్రుద్ది చెందుతుంది నాకు ఈ అవకాశం కల్పించిన సి.ఎమ్.గారిని అజన్మాంతం రునపడి వుంటాను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో జరిగిన నా మెదటి సన్మానం అద్యక్షులు రామక్రిష్ణ గౌడ్ గారికి మరియు సబ్యులందరికి క్రుతజ్నతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







