మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ

- May 17, 2017 , by Maagulf
మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ

ఒకప్పుడు అగ్ర హీరోలతో జోడి కట్టి టాప్ హీరోయిన్ అనిపించుకున్న రమ్యకృష్ణ..తాజాగా బాహుబలి మూవీ లో శివగామి గా కనిపించి యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రోల్ తర్వాత ఈమె కు వరుస పెట్టి బడా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. తాజాగా విగ్నేష్ శివన్ దర్శకత్వం సూర్య నటిస్తున్న చిత్రం లో ఓ పవర్ రోల్ దక్కిందని తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమ్యకృష్ణ ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది.. 'ఇది తాను చేస్తున్న మరో పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్.. చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది' అని తెలిపింది. సూర్య కు జోడిగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్ జోడి కట్టగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవికి షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com