యూఏఈ దిర్హామ్‌కి 44 ఏళ్ళు
- May 17, 2017
యైఏఈ దిర్హామ్ రూపకల్పన జరిగి 44 ఏళ్ళు పూర్తవుతోంది. అంతకు ముందు యూఏఈ, ఇండియన్ కరెన్సీ తోపాటుగా గల్ఫ్ రుపీ, ఖతారీ రియాల్, దుబాయ్ రియాల్, బహ్రెయినీ దినార్లను వినియోగించేది. 44 ఏళ్ళ క్రితం మే 19న యూఏఈ దిర్హామ్‌కి రూపకల్పన చేశారు. 1973లో దిర్హామ్ తొలిసారిగా బయటకు వచ్చింది. 1, 5, 10, 50, 100 డినామినేషన్లతో యూఏఈ దిర్హామ్ చెలామణీలో ఉంది. అరేబియన్ హార్స్ వాటర్ మార్క్‌తో మొదట యూఏఈ దిర్హామ్‌ని రూపొందించారు. ఆ తర్వాత యూఏఈ నేషనల్ బర్డ్ అయిన ఫాల్కన్‌తో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. కొత్త కరెన్సీ కోసం ఏర్పాటు చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ బోర్డ్ కూడా ఇదే రోజుని సెలబ్రేట్ చేసుకోనుంది. మొట్టమొదటి డినామినేషన్లపై ల్యాండ్‌మార్క్ ప్రింటింగ్ ఉండేదని నుమిస్బింగ్ ఫౌండర్ రామ్‌కుమార్ చెప్పారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ నోట్ సొసైటీ - దుబాయ్ చాప్టర్ ప్రెసిడెంట్ కూడా అయిన రామ్‌కుమార్ మాట్లాడుతూ, 1 దిర్హామ్ నోటు మీద షార్జా పోలీస్ ఫోర్ట్ క్లాక్‌టవర్‌ని ముద్రించేవారని చెప్పారు. 5 దిర్హామ్‌ల నోటుపై ఫుజారియా ఓల్డ్ ఫోర్ట్ బొమ్మ ఉండేది. 10 దిర్హామ్ నోటు మీద ఉమ్ అల్ కువైన్ ఏరియల్ వ్యూ ఉంటే, 50 దిర్హామ్ నోటు మీద అజ్మన్ రూలర్ బొమ్మను ముద్రించారు. 100 నోటు మీద రస్ అల్ ఖైమాలోని అల్ రామ్స్ బొమ్మ ఉండేది. యూఏఈలో పలువురు నివాసితులు పాత నోట్లను భద్ర పరిచి, చరిత్రకు సాక్ష్యాలుగా ఉంచారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







