వన్ టైమ్ యూజ్ మొబైల్ ఫోన్ ఛార్జర్లపై నిషేధం
- May 17, 2017
దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా, వన్ టైమ్ ఒబైల్ ఫోన్ ఛార్జర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. వాటిని వినియోగించడం, అమ్మకంపైనా నిషేధం ఉంటుందని చెప్పారాయన. పబ్లిక్ హెల్త్ మరియు కమ్యూనిటీ సేఫ్టీలో భాగంగా ఈ డిక్రీని తీసుకొచ్చారు. హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రెధా సల్మాన్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఈ ఛార్జర్ల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, ఆ కారణంగానే వీటిని బ్యాన్ చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జర్ల కారణంగా ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఎక్కువైపోతుందని వివరించారు. ఈ తరహా ఛార్జర్లను ఇకపై ఎవరూ ఇంపోర్ట్ చేయరాదనీ, విక్రయించరాదనీ, కొనుగోలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల్ని లెక్కచేయనివారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







