వలసదారుడి అదృశ్యం
- May 17, 2017
పదేళ్ళ క్రితమే బహ్రెయిన్‌కి వచ్చిన భారతీయ వలసదారుడు గుసర్మీత్ సింగ్, అదృశ్యమవడం పట్ల ఆందోలన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. మూడేళ్ళుగా ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్మీత్ సింగ్ ఆచూకీ కోసం విచారణ వేగవంతం చేశారు. వ్యవసాయ కార్మికుడిగా పనిచేసేందుకు గుర్మీత్, బహ్రెయిన్‌కి వచ్చినట్లు తెలియవస్తోంది. తన యజమాని వద్ద కాకుండా ఇంకొకరి వద్ద ఉండటంతో, అతని పాస్‌పోర్ట్, వీసా చెల్లే అవకాశం లేదు. గతంలో గుర్మీత్ నుంచి అప్పుడప్పుడూ ఫోన్ కాల్ వచ్చేదనీ, అప్పుడప్పుడూ డబ్బు కూడా పంపించేవారనీ, మూడేళ్ళ నుంచి అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్మీత్ సింగ్‌కి ఇద్దరు పిల్లలున్నారు. గుర్మీత్కౌర్ భార్య నిర్మల్ కౌర్, తన భర్త ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







