'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్
- May 17, 2017
'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలోనూ అంతటి భారీ చారిత్రక చిత్రాన్ని అందించాలని కమర్షియల్ చిత్రాల దర్శకు డు సుందర్.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీ తేనాండ్రాల్ ఫిలింస్ బ్యానర్‌పై రూ.150 కోట్ల్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం కేన్స్‌కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్.సి ఫోటోలను షేర్ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో 'సంఘమిత్ర' రూపొందనుంది. సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరా టమే ఈ చిత్ర కథ. తమిళ సినిమాకే మకుటంగా ఈ చిత్రాన్ని అత్యంత బ్రహ్మాం డంగా తెరకెక్కించాలని సుందర్.సి కసర త్తులు చేస్తున్నారు. 'బాహుబలి' తరహాలోనే రెండు భాగాలుగా 'సంఘమిత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్ రోల్‌లో శ్రుతిహాసన్ నటించనుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







