ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో రౌహనీ, ఎబ్రహీం రైసీ మధ్య పోటాపోటీ
- May 17, 2017
- మరోసారి బరిలోకి ప్రస్తుత అధ్యక్షుడు రౌహనీ
- విజయంపై ఎబ్రహీం రైసీ ధీమా
- ఈనెల 19న ఎన్నికలు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, ఎండీపీ ( మోడరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ) పార్టీ నేత, సంస్కరణవాది రౌహనీ రెండో పర్యాయం పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా సీసీఏ ( కంబాటెంట్ క్రెరిక్స్ అసోసియేషన్ ) పార్టీ నేత ఎబ్రహీం రైసీ బరిలో ఉన్నారు. అమెరికాకు సుదీర్ఘకాలం వ్యతిరేకంగా ఉన్న ఇరాన్ రౌహనీ రాకతో స్నేహహస్తం అందించింది. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో, ఇరాన్ ఆర్థికాభివృద్ధిలో గణనీయశక్తిగా ఎదిగింది. ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డియన్‌గా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ వ్యవహరిస్తున్నారు. గల్ఫ్‌జలసంధిలో ఉన్న ఇరాన్ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశంలో ఉంది. ప్రపంచంలో చమురు సరఫరా చాలాఎక్కువ శాతం ఇక్కడ నుంచే రవాణా అవుతుండటం గమనార్హం. 1979లో ఆయతుల్లా నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావడంతో ఇరాన్ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. చమురుతో పాటు సైనిక పాటవమున్న దేశం ఇరాన్. దీంతో పాటు ప్రపంచంలోని షియా మతస్థులకు అండగా నిలవడంతో పాటు సౌదీకి ధీటుగా నిలుస్తోంది.
అంతర్జాతీయ ఒప్పందంలో తనదైన ముద్రవేసిన రౌహనీ
2013లో హసన్ రౌహనీ (68) అధ్యక్షుడిగా గెలుపొం దారు. 2015లో అణ్వాయుధాల తయారీని నిలిపివేస్తున్న ట్టు ప్రకటించడంతో అంతర్జాతీయం సమాజం ఇరాన్‌పై విధించిన పలు ఆంక్షలను సడలించింది. దీంతో, ఆర్థికాభి వృద్ధిలో ఇరాన్ శరవేగంతో దూసుకెళ్లింది. రౌహనీ నిర్ణ యాన్ని బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ దేశా లు స్వాగతించాయి. రౌహనీ పదవీ బాధ్యతలు చేపట్టగానే 40శాతం ఉన్న ఇరాన్ ద్రవ్యోల్బణం 6.5 శాతానికి తగ్గడం తో ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకం రెట్టింపు అయింది. వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి వ్యతిరేకత.. తదితర అంశాలను ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావించారు. అణ్వాయుధాల తయారీ నిలిపివేత ఒప్పందంతో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పైగా, రౌహానీ విదేశాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ఖొమైనీ పలు సందర్భాల్లో విమర్శించారు.
ఎబ్రహీం రైసీకి ఖొమైనీ అండదండలు
సంప్రదాయవాదిగా పేరొందిన మాజీ అటార్నీ జనరల్ ఎబ్రహీం రైసీ (56) ఆధ్యాత్మిక గురువు ఆయాతుల్లా అలీ ఖొమైనీకి అత్యంత విశ్వాసపాత్రులు. ఆయన స్థాపించిన 'ఇమామ్ రేజా ష్రయిన్' అనే ఆధ్యాత్మిక ఫౌండేషన్‌కు 14 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉన్నది. అంతేగాకుండా, ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆయనకు సంపూర్ణ మద్దతిస్తున్నది. మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్ ప్రవేశపెట్టిన పేదలకు నేరుగా ధనాన్ని అందించే పథకాన్ని పునరుద్ధరిస్తానని రైసీ ఓటర్లకు హామీ ఇచ్చారు. అయితే, 1988లో జరిగిన సామూహిక ఖైదీల ఊచకోతలో రైసీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ప్రతికూల అంశంగా భావించవచ్చు.
5.5కోట్ల మంది ఓటర్లు...
ఇరాన్‌లో 12వ సారి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల19న జరగనున్న ఈ ఎన్నికల్లో 5.5కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో హసన్ రౌహానీ, ఎబ్రహీం రైసీల మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 1600 మంది ముందుకు రాగా, వారిలో ఆరుగురికి మాత్రం అన్‌ఎలెక్టెడ్ కన్సర్వేటివ్ ఇస్లామిక్ గార్డియన్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించింది. మహిళలెవరికీ అవకాశం లభించలేదు.
కాగా, మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో భారత్‌కు ప్రాచీన కాలం నుంచి ద్వైపాక్షిక సం బంధాలు ఉన్నాయి. ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయాన్ని భారత్ నిర్మిస్తోంది. పాక్ గ్వదర్ నౌకాశ్రయం ఇక్కడ నుంచి కేవలం 70కి.మీ. దూరంలో ఉండటంతో చాబహార్ నిర్మా ణం భారత్‌కు ఎంతగానో ఉపకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇరాన్ ద్వారా భారత్ అఫ్ఘనిస్తాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరిస్తు న్నది. తద్వారా పాక్‌ను సమర్థంగా నియంత్రించగలుగుతోం ది. ఇరాన్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా మనదేశం తో సన్నిహిత సంబంధాలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









