న్యూ వుకైర్ రోడ్ ప్రారంభం!
- May 18, 2017
1.6 కిలోమీటర్ల కొత్త శాశ్వత రోడ్డు (స్ట్రెచ్) శుక్రవారం ప్రారంభం కానుంది. రెండు ఫ్లై ఓవర్స్‌కి సంబంధించి ఇరువైపాలు రెండేసి లేన్లతో కూడిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. అల్ వక్రా బైపాస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రోడ్డుని నిర్మించారు. ఖతార్ సదరన్ ఏరియాలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం వినియోగిస్తున్న తాత్కాలిక డైవర్షన్ రూట్ నుంచి, కొత్త సెక్షన్ రోడ్స్‌లోకి రోడ్డు వినియోగదారులు షిఫ్ట్ చేయబడతారు.అల్ వుకైర్ మీదుగా వెళ్ళే ట్రాఫిక్‌ని శుక్రవారం కొత్త రోడ్డుపైకి మరల్చుతారు. అల్ వక్రా వైపు వెళ్ళే రోడ్డుని ఆదివారం షఙఫ్ట్ చేస్తారు. ఇంకో వైపున అల్ సఖామా రోడ్ నుంచి అల్ వుకైర్ రోడ్డుని కలిపే జంక్షన్ ఆదివారం నుంచి మూసివేస్తారు. ఈ మూసివేత తర్వాత ఎజ్డాన్ విలేజెస్ 28, 36, 37 వినియోగదారులు అల్ వుకైర్ రోడ్డుపై అల్ వుకైర్ రౌండ్ ఎబౌట్ వరకు సూచికల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అల్ వక్రా బైపాస్ ప్రాజెక్ట్‌కి సంబంధించి మిగతా పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. 11 కిలోమీటర్ల మెయిన్ క్యారేజ్‌వే ఇందులో భాగం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







