ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు

- May 18, 2017 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు

రమదాన్‌ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ ఉద్యోగులకు ముందస్తు వేతనాల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, సోషల్‌ సెక్యూరిటీ లబ్దిదారులు, రిటైరీస్‌కి ఈ నెల 21న ముందస్తు వేతనం అందిస్తారు. అలాగే, జూన్‌ నెల వేతనం జూన్‌ 21న అందించనున్నట్లు ప్రకటించారు. రమదాన్‌ మాసం సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చేయడానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈద్‌ అల్‌ ఫితర్‌ సందర్భంగా చేతి నిండా ధనంతో ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో మునిగి తేలతారని మినిస్ట్రీ వర్గాలు ఆకాంక్షించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com