ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా సైకిల్
- October 07, 2015
ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దత్తతకు కొత్త అర్థాన్ని చాటిచెప్పింది. శ్రీమంతుడు ప్రమోషన్ నుంచి ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది. దాదాపు 200 కోట్లు సాధించి పెద్ద సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ తొక్కుతూ విలన్ కోసం వచ్చే సన్నివేశాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఈ సైకిల్ ధర సుమారు రూ.మూడు లక్షలకు పైమాటే. అంత విలువైన ఈ సైకిల్‌ను తమ సినిమాను ఆదరించి, ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకుల కోసం కేవలం 999 రూపాయలకే ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. దీనికి ఫ్యాన్స్ చేయాల్సిందల్లా ఒకటే. శ్రీమంతుడు .కం ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా ఈ సైకిల్ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా ఈ సైకిల్ అనే వెబ్సైట్లో లాగిన్ అయి 999 రూపాయలు చెల్లించి పేరును నమోదు చేసుకోవచ్చు. వీరిలో ఒకరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి దసరా రోజున ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా ఈ సైకిల్‌ను అందిస్తారు. మరికొంత మంది అభిమానులకు మహేష్‌తో కలిసి ఒకరోజు షికారు చేసే అవకాశాన్ని కల్పించింది చిత్రయూనిట్ కల్పించింది. అంతేకాదు, కొన్ని ప్రత్యేక బహుమతులను అందించబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్మాతలు భావిస్తున్నారు. పేరు ఎంట్రీ చేసుకున్న ప్రతి ఒక్కరికీ మహేష్‌బాబు సంతకం చేసిన టీషర్ట్ ఇస్తారట. ఇంకెందుకు ఆలస్యం త్వరగా మీ పేరును నమోదు చేసుకోండి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







