ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులపై రష్యా వైమానిక దాడులు
- October 07, 2015
ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులపై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. గత నెల 30న ప్రారంభమై రష్యా దాడులు ఉగ్రవాదులకు భారీ నష్టాన్నే మిగిల్చాయి. సిరియాలోని తూర్పు ప్రాంతాలైన రఖా ప్రావిన్స్, షామిరాపై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా రఖా ప్రావిన్స్‌లో 15 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందగా, షామిరాలో నలుగురు హతమయ్యారు. ఈ దాడుల్లో ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన 12 వాహనాలతో పాటు, స్థావరాలు ధ్వంసమయ్యాయి. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై కొనసాగిస్తున్న వైమానిక దాడులను రష్యా నుండి ఉధృతం చేసినట్లు సైనికాధికారులు వెల్లడించారు. ఐఎస్ స్థావరాలను పూర్తి స్థాయిలో నిర్మూలించే వరకూ ఈ ఉధృతిని కొనసాగిస్తామన్నారు. రష్యా యుద్ధ విమానాలకు ప్రాథమికంగా ఐఎస్ కమాండ్ పాయింట్లు, ఆయుధాగారాలు, పేలుడు పదార్ధాల డిపోలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, ఆయుధ తయారీ వర్క్‌షాప్‌లు, మిలిటెంట్ శిక్షణా శిబిరాలను లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. రష్యా యుద్ధ విమానాలు 50కి పైగా ఐఎస్ స్థావరాలపై రోజుకు 60 దాడుల వంతున నిరంతరాయంగా దాడిచేస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







