సీనియర్ నటుడు కె.కె. శర్మ కన్నుమూత
- May 18, 2017
సహాయ పాత్రల్లో రాణించిన సీనియర్ నటుడు కె.కె. శర్మ (84) గురువారం ఉదయం వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లో మృతి చెందారు. కాకినాడకు చెందిన ఆయన పూర్తి పేరు కన్నెవల్లి కామేశ్వరశర్మ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించిన శర్మ, సినిమాల్లో అడుగుపెట్టక ముందు రైల్వేలో డ్రైవర్‌గా పనిచేశారు. ప్రవృత్తిగా నాటకాలు ఆడేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సినీ రంగంలోకి వచ్చారు. నటునిగా ఆయన తొలి చిత్రం 'కంచుకోట' (1967). ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినా, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ చిత్రాల్లో హాస్యాన్ని పంచారు.
'ఇన్ స్పెక్టర్ భార్య', 'బిల్లా రంగా', 'చుట్టాలబ్బాయి', 'రాజకీయ చదరంగం', 'స్వాతి కిరణం', 'పుణ్యభూమి నా దేశం', 'ఆపద్బాంధవుడు', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల మావయ్య' తదితర చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయనకు పేరు తెచ్చాయి. మిత్రులతో కలిసి ఆయన 'గోలనాగమ్మ' (1981) చిత్రాన్ని నిర్మించారు కూడా. సుదీర్ఘ కాలం సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయారని సన్నిహితులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆయనకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పింఛను అందిస్తూ వస్తోంది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







