రెడ్డిగారుగా రాబోతున్న మన బాలయ్య
- May 19, 2017
నం దమూరి బాలకృష్ణ స్పీడు పెంచారు. సెంచరీ సినిమా తరవాత.. ఆయన మరింత జోరుగా కథల్ని ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో బాలయ్య ఓ పాట కూడా పాడేశారు. తొలిసారి.. గాయకుడి అవతారం ఎత్తారు. ఈ పాటని ఇటీవలే రికార్డ్ చేశారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈలోగా మరో కథకి పచ్చజెండా వూపేశారు బాలకృష్ణ. కె.ఎస్.రవికుమార్‌తో ఆయన జట్టు కట్టబోతున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య సినిమా కోసం ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. అదే.. ‘రెడ్డి గారు’.
ఇది పక్కా కమర్షియల్ చిత్రమే అయినా... ఇందులో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుందని, ‘రెడ్డి గారు’ టైటిల్ అందుకోసమే నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు. రవికుమార్ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









