తెలంగాణ సీఎం పోలీసుల పనితీరు గర్వకారణం: కేసీఆర్
- May 19, 2017
తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీసుల సహకారం ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువవుతుందని వచ్చిన అపోహలన్నింటినీ పోలీసులు తొలగించారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులతో మాదాపూర్లోని హెచ్ఐసీసీలో కేసీఆర్ ఈరోజు సమావేశం ఏర్పాటుచేశారు. ఎస్ఐ నుంచి డీజీపీ స్థాయి అధికారులతో కలిసి సుమారు 1500 మంది పోలీసులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ నేను దిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర పోలీసులు గొప్పవాళ్లని ప్రధాని, హోంమంత్రి చెబుతున్నారు. రాష్ట్ర పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పోలీస్ శాఖకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మహిళా పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకే ‘ఫ్రెండ్లీ పోలీస్’ వ్యవస్థ తీసుకొచ్చాం. పోలీస్ శాఖకు 4వేల నూతన వాహనాలు కొనుగోలు చేశాం. అధునాతన వాహనాల కోసం కొత్తగా రూ.500 కోట్లు కేటాయిస్తాం. అధునాతన వాహనాలతో పోలీసుల పనితీరు మరింత మెరుగుపడుతుంది. రాష్ట్రంలో 806 పోలీస్స్టేషన్లు, 716 సర్కిళ్లు, 162 సబ్ డివిజన్లు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. అర్హత సాధించిన తక్షణమే పదోన్నతి ఇచ్చే విధంగా వ్యవస్థ తీర్చిదిద్దాలి. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులు పింఛన్ కోసం పైరవీ చేసే దుస్థితి ఉండకూడదు. రిటైరైన రోజు పూలమాల, శాలువాతో సత్కరించి.. వాహనంలో ఇంటి వద్దకు చేర్చాలి.’ అని కేసీఆర్ అన్నారు.
సింగపూర్లో మహిళ అర్థరాత్రి ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదనే షీ బృందాలను ఏర్పాటు చేశాం. షీ బృందాలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో గుడుంబా, పేకాట క్లబ్, గుట్కా, మట్కాలు పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాం. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరు చెప్పుకునే మేం ఓట్లు అడిగాం. దానికి ప్రజలు స్పందించి 99 సీట్లు గెలిపించారు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









