ప్రధాని నరేంద్ర మోదీకి 'సచిన్' సినిమా కబుర్లు
- May 19, 2017
అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన ఒకేఒక్కడు సచిన్ తెందుల్కర్. ఆయన శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తన జీవితం ఆధారంగా నిర్మిస్తున్న డాక్యూఫిల్మ్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ గురించి ప్రధానికి వివరించారు. నా ప్రణయగాథ చూపిస్తా తన అసమాన ఆటతీరు, కళాత్మక బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా సచిన్ అభిమానులను సంపాదించుకొన్నాడు. దిగ్గజాల చేత ‘శభాష్ సచిన్’ అనిపించుకొన్నాడు. అతడి ఆటలో ఎంత సొగసుందో కెరీర్‌లోనూ అంతే వేదన ఉంది. ఫామ్ కోల్పోయిన ప్రతిసారీ విమర్శల పాలయ్యాడు. కఠోర సాధన చేసి పునరాగమనాల్ని ఘనంగా చాటుకొన్నాడు. తన జీవితం ఆధారంగా వస్తున్న సినిమా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ ద్వారా తన ప్రేమకథ గురించి అందరూ తెలుసుకుంటారని సచిన్ మంగళవారం విలేకరులతో చెప్పిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో అంజలి ఒక భాగం ఈ సినిమాతో కెరీర్ గురించే కాకుండా తన ప్రేమ కథ గురించి కూడా తెలుసుకుంటారని సచిన్ అన్నాడు. ‘ఈ చిత్రంలో నా జీవితంలోని ప్రణయ గాథనూ మీరు చూస్తారు. నా క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో నా సతీమణి (అంజలి) పాత్ర ఎంతో కీలకం’ అని సచిన్ ఓ టీవీ ఛానల్‌తో అన్నాడు.
‘అంజలి నా కెరీర్‌లో సమ్మిళిత భాగం. నా జీవితంలోని అత్యుత్తమ భాగం అంజలి. ఐతే ఆమె ఎప్పుడూ నా కెరీర్‌లో జోక్యం చేసుకోలేదు. ఈ బయోపిక్ ద్వారా నా వ్యక్తిగత ఆలోచనలు, సంఘటనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నా’ అని అన్నాడు.
తానెప్పుడూ ఎడమ కాలికే ముందు ప్యాడ్ వేసుకొంటానని, అది తనకు సెంటిమెంట్ అన్నాడు. ఇప్పటికే విడుదలైన సచిన్ ట్రైలర్, పాటలు అభిమానులను విపరీతంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి జేమ్స్ ఎర్క్‌సైన్ దర్శకుడు. స్వరకర్త ఏఆర్ రెహమాన్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







