వర్క్ ఇంజ్యూరీస్: 370 మిలియన్ సౌదీ రియాల్స్
- May 19, 2017
సౌదీ అరేబియా హెల్త్ అండ్ సేఫ్టీ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌కి సంబంధించి వర్క్ ఇంజ్యూరీస్ 67,000 పైచిలుకు నమోదయ్యాయి. వీటి కారణంగా 370 మిలియన్ సౌదీ రియాల్స్ ఖర్చయ్యిందని అంచనా వేశారు. గత ఏడాది జరిగిన వర్క్ ఇంజ్యూరీస్లో మొదటి స్థానం, కన్స్ట్రక్షన్ రంగంలో పై నుంచి కింద పడిపోవడం వల్ల సంభవించిన వాటికే దక్కింది. వీటితోపాటుగా తవ్వకాలు, ఫ్యాక్టరీలలో పని సందర్భంగా తగిలిన గాయాలు ముఖ్య భూమిక పోషించాయి. రెండో స్థానంలో క్షణాల్లో కూలిపోయిన ఘటనలు నిలిచాయి. అండర్‌గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్స్ ప్రమాదాలు మూడో స్థానంలో నిలిచాయి. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ అందించిన లెక్కల ప్రకారం పై వివరాల్ని వెల్లడించారు. పని ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల్ని మరింత పెంచడం ద్వారా ఈ తరహా ప్రమాదాల్ని నివారించవచ్చునని సంస్థ ప్రతినిథి అబ్దుల్లా అల్ ఘామ్ది చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







