అరబ్ ప్రపంచం మేటి హోప్ మేకర్ నవాల్ అల్ సౌఫి
- May 19, 2017
అరబ్ ప్రపంచం మేటి హోప్ మేకర్‌గా నవాల్ అల్ సౌఫి ఎంపికయ్యారు. రెఫ్యూజీ హెల్పర్, లేడీ ఎస్‌ఓఎస్‌గా నవాల్ అల్ సౌఫి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 'అరబ్ హోప్ మేకర్'గా ఎంపికైనందుకుగాను నవాల్ అల్ సైఫి 1 మిలియన్ దిర్హామ్‌లు ఆమెకు నజరానాగా లభించనుంది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక&ఔ్తమ్, గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో అల్ సైఫికి బహుమతిని అందజేశారు. ఈ పోటీల్లో తదుపరి స్థానాల్లో నిలిచిన నలుగురికి కూడా 1 మిలియన్ దిర్హామ్ బహుమతిగా అందించారు. ఆయా రంగాల్లో వారు చేసిన కృషికి గుర్తింపుగా ఈ బహమతిని ప్రకటించడం జరిగింది. కువైట్‌కి చెందిన మాలీ అల్ అలస్సౌఇ, మజిదా జిబ్రాన్ (ఈజిప్ట్), హిషామ్ అల్ తాహాబి (ఇరాక్), వైట్ హెల్మెట్స్ గ్రూప్ (సిరియా) ఉన్నారు. నవాల్ అల్ సౌఫి, సిరియా నుంచి తరలి వచ్చిన రెఫ్యుజీలకు సహాయ సహకారాలు అందించడంలో చూపిన శ్రద్ధకుగాను ఈ గుర్తింపు దక్కించుకున్నారు. అవార్డు గెలిచాక తనపై బాధ్యత మరింత పెరిగిందని ఆమె చెప్పారు. బాధితులకు సహాయం అందించేటప్పుడు చెప్పలేని ఆనందం కలుగుతుందని అన్నారామె. మానవత్వానికి పరమార్థం ఇతరులకు సహాయం చెయ్యడమేనని చెప్పారు అల్ సౌఫి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







