'జై లవకుశ' ఫస్ట్‌లుక్ అదుర్స్
- May 19, 2017
ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవకుశ' ఫస్ట్‌లుక్ రిలీజైంది. యంగ్ టైగర్ బర్త్ డేకి ఒకరోజు ముందుగానే ప్రొడ్యూసర్ లుక్‌ని విడుదల చేశాడు. ఫస్ట్‌టైమ్ త్రిబుల్ రోల్స్ చేస్తున్న జూనియర్‌ని డిఫరెంట్ గెటప్స్‌లో చూపించాడు డైరెక్టర్ బాబీ. రెండు పిక్స్‌ని బయట పెట్టి, థర్డ్ లుక్‌ని సస్పెన్స్‌లో పెట్టేశాడు. దీంతో వాటిపై చర్చించుకోవడం సినీ లవర్స్ వంతైంది. ఎన్టీఆర్ అభిమానులైతే ఫుల్‌ఖుషీ. గెటప్‌ని చూసి మాస్ ఎలిమెంట్స్ భారీగానే వుంటాయని అంటున్నారు. పొలిటికల్ నేపథ్య మూవీ అని, ముగ్గురులో ఒకరు విలన్ కావడంతో ఎన్టీఆర్ వెనుక రావణాసుడుని చూపించాడని అంటున్నారు. ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ థర్డ్ గెటప్ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ హీరో పక్కన నివేదాథామస్, రాశీ ఖన్నా హీరోయిన్లు. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ దీన్ని నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







