3 యూఏఈ న్యాయ సంస్థలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
- May 19, 2017
దుబాయ్: యూఏఈకి చెందిన మూడు న్యాయ సంస్థలు ప్రతిష్టాత్మక మిడిల్ ఈస్ట్ లీగల్ అవార్డ్స్‌ని గెలుచుకున్నాయి. దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా న్యాయవాదులు హాజరయ్యారు. లండన్‌కి చెందిన బిజినెస్ లా న్యస్ వెబ్సైట్, లీగల్ వీక్ - అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ కౌన్సెల్ మిడిల్ ఈస్ట్ చాప్టర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అమెరికన్ లఆయర్ సంస్థ సహాయ సహకారాలు అందించింది. డీన్ స్టెల్ఫాక్స్, జనరల్ కౌన్సెల్, దుబాయ్ వరల్డ్ సెంటర్ అవార్డుల ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరించారు. హదెఫ్ అండ్ పార్టనర్స్ కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. బాకర్ మెకన్జీ హబీబ్ అల్ ముల్లా లిటిగేషన్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. అల్ తమిమి అండ్ కంపెనీ - రీజినల్ లా ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో పురస్కారం గెలుచుకుంది. ఈ పురస్కారాలు దక్కడం పట్ల ఆయా సంస్థల ప్రతినిథులు హర్షం వ్యక్తం చేశారు. మెరుగైన న్యాయసేవలు అందించడంలో తమ తమ సంస్థలు ప్రత్యేక చొరవ చూపిస్తున్నాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







