మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే

- May 19, 2017 , by Maagulf
మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే

మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే 10 రెట్లు ఎక్కువగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక స్పూన్ మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే మధుమేహం దూరమవుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. 
 
అలాగే మునగాకు ఐదు రకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఇందులో ఉంటుంది. యాంటీ ట్యూమర్‌గానూ ఈ మునగాకు పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందుగా మునగాకు వుంటుంది. మునగాకులో ఎ, సి విటమిన్లు, ల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉన్నాయి. మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు మేర తీసుకుంటే దృష్టిలోపాలు తగ్గిపోతాయి. రేచీకటి దరిచేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com