అమెరికా అధికారుల నిర్బంధంలో అతుల్‌ కుమార్‌ బాబూ పటేల్‌ అనే భారతీయుడి మృతి

- May 19, 2017 , by Maagulf
అమెరికా అధికారుల నిర్బంధంలో అతుల్‌ కుమార్‌ బాబూ పటేల్‌ అనే భారతీయుడి మృతి

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికా రుల కస్టడీలో ఉన్న ఓ భారతీయుడు అక్కడే ఆస్పత్రిలో మరణించారు. అతుల్‌ కుమార్‌ బాబూభారు పటేల్‌ (58)ని దేశంలోకి వచ్చేట ప్పుడు తగిన ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు లేవంటూ అధికారులు గతవారం అదుపులోకి తీసుకున్నా రు. మే 10వ తేదీన ఈక్వెడార్‌ నుంచి వచ్చిన ఓ విమానంలో ఆయన అట్లాంటాలో దిగారు. విచారణ నిమిత్తం రెండు రోజుల పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆయనను అట్లాంటాలోని సిటీ డిటెన్షన్‌ సెంటర్‌లోనే ఉంచేశారు. ఆ తర్వాత గుండెపోటుతో ఆయన మరణించారని అధికా రులు తెలిపారు. పటేల్‌ వద్ద తగిన ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు లేకపోవడం వల్లే ఆయనను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించలేదని ఇమ్మి గ్రేషన్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అట్లాంటాలోని సిటీ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉండగా ఆయనకు ప్రాథమిక వైద్యపరీక్షలు చేసినప్పుడు హైబీపీ, డయాబెటిస్‌ ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత ఆయన డయాబెటిస్‌ చూస్తున్న ఓ నర్సు.. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. భారతీయ రాయబార కార్యాలయానికి పటేల్‌ మృతి గురించి సమాచారం అందించగా, వాళ్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.

కస్టడీలో ఇలా మరణించడం చాలా అరుదుగా జరుగుతుందని ఇమ్మిగ్రేషన్‌ శాఖ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com