ఇంటిపోరు తట్టుకోలేక అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటన
- May 19, 2017
-విదేశీ పర్యటనలకు... డొనాల్డ్ ట్రంప్
- ప్రజలు, పత్రికల దృష్టిని మరల్చాలన్నదే ఉద్దేశం
- అరబ్బులు, యూదులు, వాటికన్ సిటీకి దగ్గరయ్యే ప్రయత్నం
తెల్లవారిలేస్తే పత్రికలు తన గురించి ఏ ఆరోపణలు చేస్తాయో ? ఎలాంటి కథనాలు రాస్తాయోనన్న టెన్షన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేకపో తున్నారు. దీంతో ఉన్నపళంగా సుదీర్ఘమైన విదేశీ పర్యట నల్ని ఎంచుకున్నారు. అందుకోసం శ్వేతసౌధం అధికారులు రంగం సిద్ధం చేయటం, శుక్రవారం మధ్యాహ్నమే సౌదీ అరే బియాకు బయల్దేరటం కూడా వెంటవెంటనే జరిగిపోయా యి. తొలుత రియాద్‌లో అడుగుపెట్టబోతున్నారు. అక్క డ్నుంచి ఇజ్రాయిల్, బెల్జియం, ఇటలీలో జరిగే జీ-7 దేశాల సదస్సుతో 9 రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని అమె రికా వెళ్లిపోతారు. ఈ పర్యటనల ద్వారా ముస్లిం, యూదు, క్రైస్తవ మత ప్రముఖులకు దగ్గరయ్యే ప్రయత్నం చేయబో తున్నారు. పనిలో పనిగా యూరోపియన్ యూనియన్ ము ఖ్యులతో మంతనాలు కూడా చెయనున్నారు. విదేశీ పర్యటన లక్ష్యమొక్కటే అమెరికా ప్రజల దృష్టిని మరల్చటం. అదే సమ యంలో తన విదేశాంగ విధానానికి మద్దతు కూడగట్టడం.
అధ్యక్షుడయ్యాక తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరేబి యాను ఎంచుకోవటం వెనుక ట్రంప్ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఇస్లాం పట్ల, సౌదీ అరేబియా పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇస్లాం ప్రపంచంలో రాజకీయంగా, ఆర్థికంగా శక్తిమంతులు అరబ్బులు అన్న సంగతి ఆయన గ్రహించారు. ఒబామా తన హాయంలో ఇరాన్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇది సహజంగానే సౌదీ రాజకుటుంబానికి నచ్చ లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రంప్, తాను అధ్యక్షుడ య్యాక కొత్త సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియోను సౌదీకి పంపాడు. సౌదీ, బహ్రేయిన్లో పాంపియోకు రాచమర్యా దలు దక్కాయి. ఎనలేని ప్రాధానత్య ఇచ్చారు. దీంతో వాషింగ్టన్-రియాద్ మధ్య సరికొత్త బంధాలకు మార్గం సుగమమైంది.అంతేగాక మధ్యప్రాచ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. గతంలో ఇరాన్ పట్ల ఒబామా సున్నితంగా వ్యవహరించటం అరబ్బులకు నచ్చలేదు. ఇరాన్ తో ప్రతిష్టాత్మకమైన పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకో వటం కోసం ఒబామా తనవంతు పాత్ర పోషించారు. ఇదంతా కూడా సౌదీ అరబ్బులను తీవ్ర ఆగ్రహాన్ని గురిచేశాయి. ఇరాన్‌తో పౌర అణు ఒప్పందాన్ని విమర్శించిన ట్రంప్ అంటే అరబ్బులు ఇష్టపడ్డారు. అధ్యక్షుడయ్యాక అరబ్ ప్రపంచం ఆయనకు ఎంతగానో సహకరించింది.
ఇస్లాం ప్రపంచంలో శక్తిమంతమైన దేశం సౌదీ అరేబియా. ఆ దేశంతో అమెరికాకు మొదట్నుంచీ బలమైన సంబంధాలున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇస్లాం పట్ల, సౌదీ అరేబియా పట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక వైఖరిని వెల్లడించారు. ''వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చింది ఇరాకీలు కాదు... సౌదీలు. విచారణ పత్రాలు బయటపెట్టండి ఈ విషయం తెలు స్తుంది'' అని గతంలో ట్రంప్ ఉద్వేగంగా ప్రసంగిం చారు. అలాంటి ట్రంప్ అధ్యక్షుడయ్యాక, అరబ్ దేశానికి స్నేహహస్తంచాచారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని అంతమొందించటంపై తన వద్ద ఒక రహస్య ప్రణాళిక ఉందని ట్రంప్ వారికి హామీ ఇచ్చా డు. ముఖ్యంగా అమెరికాలోని ఆయుధ లాబీ సౌదీతో మిత్రుత్వాన్ని కోరుకుంటున్నది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న అశాంతి, యుద్ధ వాతావరణం...తమకు బాగా కలిసివస్తుందని ఆయుధ లాబీ బలంగా నమ్ముతున్నది. సౌదీ అరేబియా పెద్ద ఎత్తున ఆయుధాల్ని కొనుగోలు చేయాలంటే ఈ వాతావరణం ఇలాగే కొనసాగాలని వారు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







