3 యూఏఈ న్యాయ సంస్థలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
- May 19, 2017
యూఏఈకి చెందిన మూడు న్యాయ సంస్థలు ప్రతిష్టాత్మక మిడిల్ ఈస్ట్ లీగల్ అవార్డ్స్‌ని గెలుచుకున్నాయి. దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా న్యాయవాదులు హాజరయ్యారు. లండన్‌కి చెందిన బిజినెస్ లా న్యస్ వెబ్‌సైట్, లీగల్ వీక్ - అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ కౌన్సెల్ మిడిల్ ఈస్ట్ చాప్టర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అమెరికన్ లఆయర్ సంస్థ సహాయ సహకారాలు అందించింది. డీన్ స్టెల్‌ఫాక్స్, జనరల్ కౌన్సెల్, దుబాయ్ వరల్డ్ సెంటర్ అవార్డుల ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరించారు. హదెఫ్ అండ్ పార్టనర్స్ కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. బాకర్ మెకన్జీ హబీబ్ అల్ ముల్లా లిటిగేషన్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. అల్ తమిమి అండ్ కంపెనీ - రీజినల్ లా ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో పురస్కారం గెలుచుకుంది. ఈ పురస్కారాలు దక్కడం పట్ల ఆయా సంస్థల ప్రతినిథులు హర్షం వ్యక్తం చేశారు. మెరుగైన న్యాయసేవలు అందించడంలో తమ తమ సంస్థలు ప్రత్యేక చొరవ చూపిస్తున్నాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







