ఉద్యోగార్థుల కోసం బ్యాక్‌గ్రౌండ్ చెక్ కఠినతరం
- May 19, 2017
బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి ఉద్యోగాల కోసం వెళ్ళేవారికి బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ని మరింత కఠినతరం చేస్తున్నట్లు బంగ్లాదేశ్ రాయబారి ముహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు. క్రైమ్ రేట్ తగ్గించడానికీ, అలాగే వర్క్ వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కఠిన నిర్ణయాల్ని తమ ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన తెలిపారు. యూఏఈలో బంగ్లాదేశీ వ్యక్తులు పలు నేరాలకు పాల్పడుతున్న దరిమిలా, బ్యాక్‌గ్రౌండ్ చెక్ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఆయన వివరించారు. యూఏఈలో మొత్తం 700,000 నుంచి 800,000 వరకు బంగ్లాదేశీ వలసదారులు నివసిస్తున్నారు. ఎంబసీ లెక్కల ప్రకారం చూస్తే 700 నుంచి 800 మంది యూఏఈ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు వివిధ నేరాలకు సంబంధించి. 2014లో ఖైదీల అప్పగింత సహా పలు విషయాలపై ఇరు దేశాల మధ్యా ఒప్పందం కుదిరింది. 2015లో యూఏఈ, ఢాకాలో వీసా సెంటర్‌ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







