హౌతీ బాలిస్టిక్ మిసైల్‌ని కూల్చేసిన సౌదీ దళాలు
- May 20, 2017
సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, యెమెన్ నుంచి హౌతీ మిలీషియాస్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్‌ని కూల్చివేశాయి. అరబ్ కొలిషన్ కమాండ్ ఈ వివరాల్ని వెల్లడించింది. సౌదీ అరేబియా మీదుగా దీన్ని యెమెన్ నుంచి మిలీషియా దళాలు ప్రయోగించగా, కూల్చివేయడం జరిగింది. అల్ రిన్ ప్రాంతంలో ఈ మిసైల్‌ని రాత్రి 8.45 నిమిషాల సమయంలో పేల్చేశారు. ఇరాన్ మద్దతుతో యెమెన్‌లోని హౌతీస్ బుర్కాన్-1 అనే మిసైల్‌ని రియాద్ వైపు ప్రయోగించారు. త్వరలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ పర్యటించనుండగా, ఈలోగా మిసైల్ దాడికి తెగించారు. సౌదీ అరేబియా వైపు హౌతీలు మిసైల్స్‌ని ప్రయోగించడం ఇదే కొత్త కాదు. యెమెన్ బోర్డర్ వైపుగా సౌదీ అరేబియా దళాలు ప్రత్యేక వ్యవస్థల ద్వారా అటువైపునుంచి వచ్చే మిసైల్స్‌ని, రాకెట్స్‌ని కూల్చివేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







