కార్న్ ప్రాన్స్
- May 20, 2017
కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - 2, కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., అల్లం - 10 గ్రా., వెల్లుల్లి -10 గ్రా., మొక్కజొన్నపిండి - 1 టేబుల్ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
రొయ్యలకు పట్టించడానికి: మొక్కజొన్న పిండి - 30 గ్రా., తెల్లసొన - 2 గుడ్లవి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: రొయ్యల్ని ముందుగా పొట్టుతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, గుడ్ల తెల్లసొన, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జారులో రొయ్యల్ని ముంచి, నూనెలో 80 శాతం దాకా వేగించాలి. ఇపడు మరో పాత్రలో టేబుల్ స్పూను నూనె వేసి అల్లం, వెలుల్లి ముక్కల్ని వేగించి కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. నీళ్లు మసులుతుండగా రొయ్యల్ని ఇందులో వేసి మిగతా 20 శాతం ఉడికించాలి. ఒక టేబుల్ స్పూను మొక్కజొన్నపిండి నీళ్లలో కలిపివేసి కాసేపుంచి దించేయాలి. ఇది అన్నంలోకి నంజుకోడానికి బాగుంటుంది..
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









